Covid-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌పై మరో ఆసక్తికర విషయం వెల్లడించిన నిపుణులు

Uses Of Covid-19 Vaccination | కోవిడ్19 మహమ్మారిని అత్యుత్తమంగా ఎదుర్కొన్న దేశమైన భారత్ కరోనా టీకాలను సైతం ఉత్పత్తి చేసి దాదాపు 60 దేశాలకు పంపిణీ చేసి సాయం చేసింది. కానీ అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2021, 03:01 PM IST
Covid-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌పై మరో ఆసక్తికర విషయం వెల్లడించిన నిపుణులు

Covid-19 Vaccination: కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాలలో భారత్ ఒకటి. గత ఏడాది కోవిడ్19 మహమ్మారిని అత్యుత్తమంగా ఎదుర్కొన్న దేశమైన భారత్ కరోనా టీకాలను సైతం ఉత్పత్తి చేసి దాదాపు 60 దేశాలకు పంపిణీ చేసి సాయం చేసింది. కానీ అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. పాలకుల నిర్లక్ష్యమో, లేక కోవిడ్19 నిబంధనలు పాటించకపోవడమో.. ఏదైతేనేం నేడు 24 గంటల వ్యవధిలో ఏకంగా 3,79,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కు చేరింది. కరోనా వ్యాక్సిన్లతో ప్రయోజనంపై ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది.

గతంలో కరోనా వైరస్ పాజిటివ్ సోకిన వ్యక్తుల ఇళ్లల్లో ఇతరులకు సైతం మహమ్మారి బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం పరిశోధకులు భారీ మార్పులు గుర్తించారు. టీకా తీసుకున్న వారిలో కరోనా పాజిటివ్ ఉన్నా, ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందేరేటు సగం వరకు తగ్గడం గమనార్హం. ఫైజర్, ఆస్ట్రాజెనెకా కరోనా టీకాలు తొలి డోసు తీసుకున్న వారిలో బ్రిటన్ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. కరోనా తీసుకున్న వారిలో యాంటీబాడీస్ ఉత్పత్తి కావడంతో వైరస్ బారిన పడినట్లు గుర్తించేలోగా వారు కోలుకుంటున్నారు. అందువల్లే అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు తీసుకోవాలని వైద్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. 

Also Read: Co-Win Registration: కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవాలో తెలుసా

కరోనా టీకాలు తీసుకోని వారిలో ఇంట్లో మిగతా కుటుంబసభ్యులలో దాదాపుగా అందరికీ వైరస్ సోకే అవకాశాలున్నట్లు గుర్తించారు. టీకా తీసుకున్న వారికి కరోనా సోకితే వారి ఇంట్లోగానీ, వారితో నేరుగా కలిసిన వారిలో దాదాపు సగం మంది మాత్రమే కోవిడ్19 బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మీ కుటుంబసభ్యులను సైతం కొంతమేర కాపాడిన వారవుతారు. భారత్‌లో అర్హులైన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అనంతరం భారత్ బయోటెక్, సీరం సంస్థలు తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్లు కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ల ధరలు ప్రకటించాయి.

మే 1 నుంచి దేశ వ్యాప్తంగా మూడో దశలో కరోనా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ 45 ఏళ్లు పైబడిన వారికే టీకాలు అంతగా సరిపోని పరిస్థితులలో 18 ఏళ్లు పైబడిన వారికి ఏమేరకు కరోనా టీకాలు ఇస్తారనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు కేంద్రానికి ఓ ధర, రాష్ట్రానికి ఓ ధర అంటూ  వ్యత్యాసాలెందుకని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొంతమేరకు ధర తగ్గించారు. జీఎస్టీ ఎత్తివేస్తే ధర మరింత దిగిరానుందని రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి. 

Also Read: COVID-19 నుంచి రికవరీ అయినవాళ్లు తీసుకోవాల్సిన Food, ఇతర జాగ్రత్తలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News